: విభజనలో కేంద్రం తెలంగాణకు అన్యాయం చేసింది: వినోద్
హైకోర్టు విభజన విషయంలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ ఆరోపించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, హైకోర్టు విభజనపై ఈ నెల 21 లోపు కేంద్రం నిర్ణయం తీసుకోకపోతే పార్లమెంటు సమావేశాలను స్థంభింపజేస్తామని హెచ్చరించారు. ఓటుకు నోటు కేసులో బెయిల్ పై విడుదలైన టీడీపీ నేత రేవంత్ రెడ్డి బెయిల్ నిబంధనలను ఉల్లంఘించారని ఆయన పేర్కొన్నారు.