: 'మేడిన్ చైనా', 'మేకిన్ ఇండియా' భాయీ భాయీ!


ఉత్పత్తి రంగంలో ఇండియా దూసుకుపోతున్న విధానాన్ని చూసిన చైనా 'మేడిన్ చైనా', 'మేకిన్ ఇండియా'లను కలిపి కొత్త విధానాన్ని తయారు చేయాలని భావిస్తోంది. ఇరు దేశాలూ కలిస్తే వాణిజ్య లోటు దిగివస్తుందని, ఇటీవలి మోదీ చైనా పర్యటనలోనూ ఇదే విషయం చర్చకు వచ్చిందని చైనా విదేశాంగ శాఖ ఆసియా వ్యవహారాల విభాగం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ హువాంగ్ క్సిల్లన్ వ్యాఖ్యానించారు. శాస్త్రసమ్మతంగా వివాదాలు పరిష్కరించుకునేందుకు తాము కృషి చేస్తున్నామని, అందుకోసం కొత్త విధానం, పద్ధతులు అవలంబించాల్సి వుందని అన్నారు. పరస్పర పెట్టుబడులను ప్రోత్సహించాల్సి వుందని, దీనిని బట్టి వాణిజ్య సమతుల్యం ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. మరిన్ని చైనా పెట్టుబడులను భారత్ కు తరలించేందుకు రెండు ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇండియాలో తయారైన వస్తువులను కొనుగోలు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, మరో ఐదేళ్లలో చైనా దిగుమతుల విలువ 10 ట్రిలియన్ డాలర్లను చేరుతుందని, అందులో సాధ్యమైనన్ని ఎక్కువ దిగుమతులు ఇండియా నుంచి వచ్చేలా చూస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News