: ఇది కూడా మా పథకమే... పేరు మార్చారు: మోదీ సర్కారుపై కాంగ్రెస్ విమర్శలు


ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించిన డిజిటల్ ఇండియా పథకంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఇతర పథకాల మాదిరే ఈ పథకం కూడా యూపీఏ నాటిదేనని పేర్కొంది. 'డిజిటల్ ఇండియా' అంటూ మరో పథకానికి విజయవంతంగా పునఃనామకరణం చేశారంటూ ఎద్దేవా చేసింది. ఐటీ రంగంలో భారత్ సూపర్ పవర్ గా ఎదిగిందంటే అది రాజీవ్ గాంధీ చలవేనని తెలిపింది. దేశంలో ఐటీ విప్లవానికి రాజీవ్ గాంధీయే కారణమని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్ దీప్ సూర్జీవాలా పేర్కొన్నారు. తాము అప్పట్లో 'నేషనల్ ఈ-గవర్నెన్స్ ప్లాన్' (ఎన్ఈజీపీ) పేరిట ప్రవేశపెట్టిన పథకాన్నే తాజాగా 'డిజిటల్ ఇండియా' అంటూ తెరపైకి తెచ్చారని వెల్లడించారు. అన్ని రకాల సేవలు సామాన్యుడికి అందుబాటులోకి రావాలనే తాము 'ఎన్ఈజీపీ'ని ప్రవేశపెట్టామని తెలిపారు.

  • Loading...

More Telugu News