: మనిషి తయారు చేసిన రోబో... ఓ వ్యక్తిని చంపేసింది


రోబోటిక్స్ కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో ఒక ఉదంతం విషాదాన్ని మిగిల్చింది. మనిషికి సహాయపడాల్సిన రోబో ఒక వ్యక్తినే చంపేసింది. ఈ ఘటన, జర్మనీలోని ఫ్రాంక్ ఫర్ట్ నగరానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫోక్స్ వ్యాగన్ ప్లాంట్ లో చోటు చేసుకుంది. ప్లాంట్ లో పనిచేస్తున్న 22 ఏళ్ల వ్యక్తిని రోబో ఒక మెటల్ ప్లేట్ కు క్రష్ చేసి చంపేసింది. అయితే, ఇందులో రోబో తప్పిదమేమీ లేదని... కేవలం మానవ తప్పిదం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని కంపెనీ ప్రతినిధి తెలిపారు. ఆపరేటింగ్ లో తేడా వల్లే ఈ ఘోరం సంభవించిందని తెలిపాడు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు సాగుతోంది. ఈ ప్లాంటులో రకరకాల కార్యకలాపాలను నిర్వహించడానికి రోబోలను ఉపయోగిస్తున్నారు.

  • Loading...

More Telugu News