: రాష్ట్రపతితో మాజీ సీఎం కిరణ్ భేటీ
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి కొద్దిసేపటి కిందట భేటీ అయ్యారు. వర్షాకాల విడిదికోసం హైదరాబాద్ వచ్చిన ప్రణబ్ ను బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆయన కలిశారు. రాష్ట్ర విభజన నుంచి కిరణ్ రాజకీయాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. తాజాగా రాష్ట్రపతితో సమావేశమై కిరణ్ ఏ విషయాలపై చర్చిస్తున్నారన్నది ఆసక్తికరంగా మారింది.