: చంద్రబాబుకూ రేవంత్ మాదిరే జైలు తప్పదు... టీ మంత్రి జూపల్లి వ్యాఖ్య


ఓటుకు నోటు కేసులో మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. కేసులో ప్రధాన నిందితుడు రేవంత్ రెడ్డి నిన్న బెయిల్ పై విడుదలైన సందర్భంగా ప్రారంభించిన మాటల యుద్ధం టీడీపీ, టీఆర్ఎస్ ల మధ్య కొనసాగుతూనే ఉంది. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రేవంత్ వ్యవహారంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ కేసులో పాత్ర ఉన్న టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుకు కూడా రేవంత్ రెడ్డిలాగే జైలు తప్పదని జోస్యం చెప్పారు. బెయిల్ పై విడుదలైన రేవంత్ రెడ్డి తన నోటిని అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల ఆత్మ బలిదానాలకు టీడీపీనే కారణమని కూడా జూపల్లి కొత్త ఆరోపణను వినిపించారు.

  • Loading...

More Telugu News