: భర్త పింఛన్ ను రెండో భార్య తీసుకునే హక్కు ఉంటుంది: మద్రాస్ హైకోర్టు


చట్ట ప్రకారం పెళ్లి చేసుకోకపోయినా సహజీవనం చేసిన మహిళకు భర్త పింఛన్ ను అందుకునే హక్కు ఉంటుందని మద్రాస్ హైకోర్టు తీర్పు వెలువరించింది. కోయంబత్తూర్ కు చెందిన హెడ్ కానిస్టేబుల్ స్టాన్లీ రెండో భార్య సుశీల కేసులో కోర్టు పైవిధంగా తీర్పు వెల్లడించింది. కేసు వివరాల్లోకి వెళితే... స్టాన్లీ అనే హెడ్ కానిస్టేబుల్ కు 1973లో సుగంతి అనే మహిళతో వివాహమైంది. అనంతరం మనస్పర్థల కారణంగా వారిద్దరూ విడిపోయారు. అయితే భార్యకు విడాకులు ఇవ్వకుండానే సుశీల అనే మరో మహిళతో స్టాన్లీ కలిసి ఉంటున్నాడు. ఇటీవలే అతను చనిపోయాడు. తరువాత మొదటి భార్య సుగంతి కూడా మరణించింది. ఈ నేపథ్యంలో కానిస్టేబుల్ కుటుంబానికి వచ్చే పింఛన్ ను తనకు ఇప్పించాలంటూ సుశీల ఎకౌంటెంట్ జనరల్ కు అప్పీలు చేసుకుంది. అయితే ఆమె చట్ట ప్రకారం స్టాన్లీ భార్య కాదంటూ ప్రతిపాదనను తిరస్కరించారు. దాంతో సదరు మహిళ హైకోర్టుకు వెళ్లడంతో ఆమెకు అనుకూలంగా తీర్పు వెలువరించింది.

  • Loading...

More Telugu News