: బాసర వద్ద గోదావరికి జలకళ


పుష్కరాల సమయంలో పవిత్ర పుణ్యక్షేత్రం బాసర వద్ద ఉన్న గోదావరిలో నీటి చుక్క లేకపోవడంతో జనాలు, అధికారులు, అధికార పార్టీ నేతలు దిక్కుతోచని స్థితికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో, ఎగువనున్న బాబ్లీ ప్రాజెక్టు గేట్లను మహారాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేయడంతో గోదావరికి జలకళ వచ్చింది. ఎగువ నుంచి వస్తున్న నీరు బాసర మీదుగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి చేరుతోంది. సుప్రీంకోర్టు తీర్పు మేరకు... ఇరు రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం మహారాష్ట్ర అధికారులు బాబ్లీ ప్రాజెక్టు గేట్లను ఎత్తివేశారు. 14 గేట్ల ద్వారా 0.17 టీఎంసీల నీరు దిగువకు విడుదలవుతోంది. దీంతో, బాసర వద్ద గోదావరి కళకళలాడుతోంది.

  • Loading...

More Telugu News