: నన్ను ఇరికించడానికే మీడియా ఇలాంటి ప్రశ్నలు వేస్తోంది: డీఎస్


కాసేపటి క్రితం మీడియాతో ముచ్చటించిన సీనియర్ నేత డీఎస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీడియా సమావేశం సందర్భంగా, గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొందరు టీఆర్ఎస్ లో చేరినప్పుడు... వాళ్లంతా స్వార్థం, స్వలాభం కోసమే టీఆర్ఎస్ లో చేరారని తమరు విమర్శించారు కదా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీంతో, వారంతా స్వార్థం కోసమే పార్టీ మారారని... తాను మాత్రం ఏ పదవినీ ఆశించకుండా టీఆర్ఎస్ లోకి వెళ్తున్నానని డీఎస్ సమాధానమిచ్చారు. అంతేకాకుండా, తనను ఇరికించడానికే మీడియా ఇలాంటి ప్రశ్నలు వేస్తోందని డీఎస్ అనడం కొసమెరుపు.

  • Loading...

More Telugu News