: రేవంత్ బెయిల్ ను రద్దు చేయండి.... సుప్రీంకోర్టులో తెలంగాణ ఏసీబీ పిటీషన్


ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడు, టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డి బెయిల్ ను రద్దు చేయాలని తెలంగాణ ఏసీబీ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున రేవంత్ బెయిల్ రద్దు చేయాల్సిందేనని కొద్దిసేపటి క్రితం దాఖలు చేసిన తన పిటీషన్ లో ఏసీబీ అధికారులు కోర్టును అభ్యర్థించారు. ఈ మేరకు ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ ఉత్తర్వులను రద్దు చేయాలని వారు కోర్టుకు విన్నవించారు. రేవంత్ రెడ్డితో పాటు ఈ కేసులో సహ నిందితులుగా ఉన్న సెబాస్టియన్, ఉదయ సింహల బెయిళ్లను కూడా రద్దు చేయాలని ఏసీబీ తన పిటీషన్ లో సుప్రీంకోర్టును కోరింది.

  • Loading...

More Telugu News