: డీఎస్ ఓ అవకాశవాది: ఎంపీ పొన్నం


కాంగ్రెస్ కు రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరబోతున్న పీసీసీ మాజీ అధ్యక్షుడు డీ.శ్రీనివాస్ పై కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శలు చేశారు. డీఎస్ పచ్చి అవకాశవాది అని వ్యాఖ్యానించారు. పదవీకాంక్షతోనే పార్టీ ఫిరాయిస్తున్నారని ఆరోపించారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వదిలి వెళ్లడం సరికాదన్నారు. ఇతర పార్టీల నుంచి నేతలను టీఆర్ఎస్ లోకి చేర్చుకుని సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్నారని పొన్నం మండిపడ్డారు.

  • Loading...

More Telugu News