: ‘అనంత’ ఆల్ట్రాటెక్ వద్ద ఉద్రిక్తత... నిజనిర్ధారణ కోసం వెళ్లిన కార్మిక నేతల అరెస్ట్


సిమెంట్ తయారీ దిగ్గజం ఆల్ట్రాటెక్ కు చెందిన తాడిపత్రి ప్లాంట్ వద్ద కొద్దిసేపటి క్రితం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఆల్ట్రాటెక్ కు భారీ ప్లాంట్ ఉన్న సంగతి తెలిసిందే. వివిధ కారణాల వల్ల కొంతకాలం క్రితం ఈ ప్లాంట్ లో ఉత్పత్తి నిలిచిపోయింది. కంపెనీ మూతపడింది. దీంతో పెద్ద సంఖ్యలో కార్మికులు రోడ్డున పడ్డారు. కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునైనా ప్లాంట్ ను పునరుద్ధరించాలని కొంతకాలంగా కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్లాంట్ మూతకు దారితీసిన కారణాలను వెలికితీసేందుకు కార్మిక సంఘాల నేతృత్వంలోని నిజనిర్ధారణ కమిటీ కొద్దిసేపటి క్రితం అక్కడికి పరిశీలనకు వెళ్లింది. అయితే ఈ కమిటీని ప్లాంట్ లోపలికి అనుమతించేందుకు యాజమాన్యం నిరాకరించింది. దీంతో అక్కడున్న భద్రతా సిబ్బందిని తోసేసిన కమిటీ సభ్యులు ప్లాంట్ లోపలికి ప్రవేశించేందుకు యత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని కమిటీ సభ్యులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎట్టకేలకు కమిటీ సభ్యులను అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్ కు తరలించారు.

  • Loading...

More Telugu News