: ఇక ఖమ్మంలోనే ఉంటా...ఏసీబీకి లేఖ తర్వాత ఎవ్వరూ సంప్రదించలేదు: సండ్ర వెంకట వీరయ్య


ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలంగాణలో కాలుమోపారు. ఓటుకు నోటు కేసులో విచారణకు హాజరుకావాలని ఏసీబీ జారీ చేసిన నోటీసులతో ఉన్నపళంగా అదృశ్యమైన సండ్ర రాజమండ్రిలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారట. నిన్నటి దాకా రాజమండ్రి పేరు కాని, ఆస్పత్రి పేరు కాని వెల్లడించని సండ్ర, కేసులో ప్రధాన నిందితుడు రేవంత్ రెడ్డికి బెయిల్ మంజూరు కాగానే ప్రత్యక్షమయ్యారు. తన ఆరోగ్యం కుదుటపడిందని పేర్కొంటూ, విచారణకు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చేందుకు సిద్ధంగానే ఉన్నానని ఆయన నిన్న ఏసీబీకి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో నిన్న రాత్రే ఆయన ఖమ్మం చేరుకున్నట్లు సమాచారం. తాజాగా కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన సండ్ర, ఇకపై తాను ఖమ్మంలోనే ఉంటానని ప్రకటించారు. అంతేకాక ఏసీబీకి తాను లేఖ రాసిన తర్వాత తననెవరూ సంప్రదించలేదని కూడా వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News