: 5న యాదగిరిగుట్టకు రాష్ట్రపతి ప్రణబ్


భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రస్తుతం వర్షాకాల విడిది కోసం హైదరాబాద్ కు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన చాలా బిజీగా గడుపుతున్నారు. నిన్న తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్న ప్రణబ్ ముఖర్జీ... ఈ నెల 5న యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకోనున్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్ తో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పాల్గొంటారని సమాచారం.

  • Loading...

More Telugu News