: రాజమండ్రిలో పురోహితుల రిలే నిరాహార దీక్ష
రాజమండ్రిలో పురోహితుల సంఘం రిలే నిరాహార దీక్ష చేపట్టింది. గోదావరి పుష్కరాల్లో భాగంగా ప్రతి ఘాట్ లో విధులు నిర్వహించేందుకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై గతంలో అధికారులతో చర్చలు జరిపినా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వారు ఆరోపిస్తున్నారు.