: తానా సభలకు నేడే శ్రీకారం...చీఫ్ గెస్ట్ గా ‘సుప్రీం’ న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ
అమెరికాలో ప్రవాసాంధ్రుల సంస్థ ‘తానా’ (తెలుగు అసోసియేషన్ ఆప్ నార్త్ అమెరికా) మహా సభలకు నేడు తెరలేవనుంది. అమెరికా నగరం డెట్రాయిట్ లో ఈ సమావేశాలు మూడు రోజుల పాటు అంగరంగవైభవంగా జరగనున్నాయి. పలువురు తెలుగు ప్రముఖులు పాలుపంచుకోనున్న ఈ సమావేశాలకు తానా సభ్యులు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ (ఎన్వీ రమణ)ను చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించారు. నిన్న డెట్రాయిట్ చేరుకున్న జస్టిస్ ఎన్వీ రమణ దంపతులకు అక్కడి తెలుగు ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం భారీ ర్యాలీ మధ్య జస్టిస్ ఎన్వీ రమణ తానా ప్రతినిధి యార్లగడ్డ శివరాం నివాసానికి చేరుకున్నారు.