: కేసీఆర్ తో భేటీ అయిన ఏసీబీ డీజీ ఏకే ఖాన్... రేవంత్ చేసిన తీవ్ర వ్యాఖ్యలపై చర్చ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఏసీబీ డీజే ఏకే ఖాన్ భేటీ అయ్యారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వీరిరువురూ ఓటుకు నోటు కేసుపై చర్చించారు. గత నెల రోజులుగా ఈ కేసులో జరిగిన పురోగతి, పరిణామాలను కేసీఆర్ కు ఖాన్ వివరించారు. అంతేకాకుండా, భవిష్యత్తులో ఈ కేసులో ఎలా ముందుకు వెళ్లనున్నారో కూడా వివరించినట్టు తెలుస్తోంది. నిన్న టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి బెయిల్ పై విడుదలైన తర్వాత... కేసీఆర్, తెలంగాణ మంత్రులపై చేసిన తీవ్ర వ్యాఖ్యలు కూడా చర్చకు వచ్చినట్టు సమాచారం.