: నల్లారి బయటకొస్తున్నారు... నేడు రాష్ట్రపతితో భేటీ కానున్న మాజీ సీఎం కిరణ్
ఉమ్మడి రాష్ట్రానికి ఆఖరు సీఎంగా చరిత్రకెక్కిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చాలాకాలం తర్వాత బయటకొస్తున్నారు. గడచిన ఎన్నికల్లో కాస్త హడావిడి చేసిన నల్లారి ఆ తర్వాత అడ్రెస్ లేకుండా పోయిన సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందు ఆయన స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీ కూడా దాదాపుగా కనుమరుగైపోయింది. తాజాగా దక్షిణాది విడిది కోసం హైదరాబాదు వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో నేటి మధ్యాహ్నం కిరణ్ కుమార్ రెడ్డి భేటీ అవుతున్నారు. ఇదిలా ఉంటే, నల్లారి భేటికి అరగంట ముందు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కూడా రాష్ట్రపతితో భేటీ కానున్నారట.