: వారు గొరిల్లాలు... గూగుల్ జాతి వైషమ్యం, ఆపై క్షమాపణలు


ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ (కృత్రిమ మేధస్సు)తో పనిచేసేలా గూగుల్ తయారు చేసిన ఫోటో యాప్ ఆ సంస్థ కొంపముంచింది. ఇందులో నెటిజన్లు పెట్టిన ఫోటోలు ఆటోమేటిక్ గా ట్యాగ్ అవుతుంటాయి. అంటే మీ స్నేహితులు పెట్టే మీ ఫోటోలను యాప్ గుర్తించి మీకు ట్యాగ్ చేస్తుందన్నమాట. ఓ నల్లజాతి యువకుడు జాకీ అల్సైన్ ఇద్దరు స్నేహితుల చిత్రాలను యాప్ కు జోడిస్తే, వారిని 'గొరిల్లా'లుగా పేర్కొంటూ లేబుల్ ఇచ్చింది. దీనిపై అతను తీవ్రంగా స్పందించాడు. తన స్నేహితులు గొరిల్లాలు కాదని విరుచుకుపడ్డాడు. గూగుల్ జాతి వైషమ్యాన్ని ప్రోత్సహిస్తోందని దుయ్యబట్టాడు. విషయం తెలిసిన వెంటనే గూగుల్ చీఫ్ ఆర్కిటెక్ట్ యోనాటన్ జుంగర్ స్వయంగా జాకీతో మాట్లాడారు. క్షమాపణలు చెప్పాడు. ఆపై తప్పును సరిదిద్దారు. ఈ తరహా ఘటనలు జరగకుండా చూస్తామని తెలిపారు. కాగా, నల్లజాతి వారి చిత్రాలు అప్ లోడ్ అయినప్పుడు 'ఏప్', 'యానిమల్' వంటి లేబుల్స్ వస్తున్నాయని, ఆటో ట్యాగ్ టెక్నాలజీ కారణంగానే ఇది జరుగుతోందని, సమస్యను సరిదిద్దే ప్రయత్నంలో ఉన్నామని గూగుల్ చెబుతోంది.

  • Loading...

More Telugu News