: ఆ విమానం కూలడానికి కారణమిదే!


గడచిన ఫిబ్రవరిలో ట్రాన్స్ ఆసియా ఎయిర్ వేస్ కు చెందిన ఏటీఆర్ విమానం కూలిపోయి 43 మంది మరణించిన ఘటన వెనుక పైలట్ తప్పిదం ఉందని ఏవిఏషన్ సేఫ్టీ కౌన్సిల్ అధికారులు ఓ నివేదిక ఇచ్చారు. పైలట్ తప్పుడు బటన్లను నొక్కాడని, దీంతో విమానం ఇంజన్ గాల్లోనే ఆగిపోయిందని వారు తెలిపారు. తాను తప్పుడు బటన్లు లాగినట్టు విమానం టేకాఫ్ అయిన మూడో నిమిషంలో పైలట్ వ్యాఖ్యానించినట్టు కాక్ పీట్ వాయిస్ రికార్డరులో రికార్డయింది. ఈ విమానం కూలిన ఘటనపై వచ్చే సంవత్సరం ఏప్రిల్ నాటికి పూర్తి నివేదిక ఇస్తామని అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News