: ప్రణబ్ తో ఏకాంతంగా గంటకు పైగా గడిపిన బాబు!
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో ఏకాంతంగా గంటకు పైగా గడిపే అరుదైన అవకాశం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లభించింది. సాధారణంగా ఏ చిన్న అవకాశం లభించినా, సద్వినియోగం చేసుకునే బాబు ఈ సమయాన్ని ఎలా వినియోగించుకున్నారోనన్న చర్చ జరుగుతోంది. నిన్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న తరువాత బాబును తన కారులోకి ఆహ్వానించారు. అక్కడి నుంచి తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం వరకూ, ఆపై అక్కడి నుంచి కపిలేశ్వర స్వామి దేవాలయం, అక్కడి నుంచి తిరుమల పద్మావతి అతిథి గృహం వరకూ రాష్ట్రపతి కారులోనే చంద్రబాబు ప్రయాణించారు. మొత్తం 1:10 నిమిషాల పాటు వారు కలసి వున్నారు. ఈ క్రమంలో దాదాతో బాబు రాజకీయ పరమైన అంశాలను ప్రస్తావించి వుంటారా? అన్న చర్చకు తెరలేచింది.