: సొంతూళ్లో రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం... నియోజకవర్గ పర్యటనకు రేవంత్ సన్నాహాలు
ఓటుకు నోటు కేసులో నెల రోజుల పాటు జైల్లో ఉండి నిన్న విడుదలైన టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డికి తన సొంత నియోజకవర్గం కొడంగల్ లో ఘన స్వాగతం లభించింది. నిన్న సాయంత్రం బెయిల్ పై విడుదలైన రేవంత్ రెడ్డి భారీ ర్యాలీ వెంటరాగా టీడీపీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ మీదుగా అర్ధరాత్రి జూబ్లీహిల్స్ లోని తన ఇంటికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత రాత్రికి రాత్రే ఆయన తన సొంత నియోజకవర్గం కొడంగల్ కు కుటుంబ సమేతంగా బయలుదేరారు. తెల్లవారుజామున కొడంగల్ లో టీడీపీ కార్యకర్తలు, అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. కార్యకర్తలు జయజయధ్వానాల మధ్య స్వగృహం చేరుకున్న రేవంత్ రెడ్డి, నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటనకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు సమాచారం.