: ‘ఓలా’లో రతన్ టాటా పెట్టుబడి... వ్యక్తిగత హోదాలో ఇన్వెస్ట్ మెంట్!
స్టార్టప్ కంపెనీలపై ‘టాటా సన్స్’ ఆనరరీ చైర్మన్ రతన్ టాటా ఆసక్తి ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే స్నాప్ డీల్, కార్ దేఖో, పేటీఎం, అర్బన్ లాడర్ లో పెట్టుబడులు పెట్టిన రతన్ టాటా, తాజాగా మరో స్టార్టప్ కంపెనీ ‘ఓలా’లోనూ వాటా తీసుకున్నారు. బొంబాయి ఐఐటీలో చదివిన భవిష్ అగర్వాల్, అంకిత్ భట్టిలు ప్రారంభించిన ఈ కంపెనీపై ఆసక్తి కనబరచిన రతన్ టాటా కొంత వాటా చేజిక్కించుకున్నారు. అయితే సదరు కంపెనీలో ఎంతమేర వాటాను ఆయన కొనుగోలు చేశారన్న విషయం వెల్లడికాలేదు. ఇక టాటా సన్స్ ఆనరరీ చైర్మన్ హోదాలో కాకుండా పూర్తిగా వ్యక్తిగత హోదాలోనే ఓలాలో రతన్ టాటా వాటా కొన్నారు.