: రూ.2 లక్షల కోట్ల ఆస్తి మొత్తాన్ని దానమిచ్చేస్తా!: సౌదీ యువరాజు సంచలన ప్రకటన
సౌదీ అరేబియా యువరాజు అల్వలీద్ బిన్ తలాల్ ప్రపంచ కుబేరుల్లో ఒకరు. ఇటీవల మరణించిన సౌదీ రాజు అబ్దుల్లా మేనల్లుడైన ఈయన ఆస్తి దాదాపు రూ.2 లక్షల కోట్లు. ఈ మొత్తాన్ని దానమిచ్చేస్తానని నిన్న ఆయన ఓ సంచలన ప్రకటన చేశారు. అయితే ఈ వితరణకు ఎలాంటి కాలపరిమితి లేదని ఆయన చెప్పుకొచ్చారు. ‘‘సాంస్కృతిక అవగాహన పెంపొందించడం, కమ్యూనిటీల అభివృద్ధి, యువత శక్తి సామర్థ్యాలను మెరుగుపరచడం, ప్రకృతి విపత్తుల్లో సహాయ కార్యక్రమాలు చేపట్టడం, మరింత ఉన్నతమైన ప్రపంచ నిర్మాణం కోసమే నేను నా ఆస్తినంతా దానం చేయాలని నిర్ణయించుకున్నాను’’ అని ఆయన నిన్న విస్పష్టంగా ప్రకటించారు. మానవత్వంతో తాను చేపట్టే కార్యక్రమాలు తన మరణానంతరం కూడా నిర్విఘ్నంగా కొనసాగేలా కార్యాచరణ రూపొందిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.