: కాల్ డేటా ఇచ్చేందుకు నెల రోజులెందుకు?...సర్వీస్ ప్రొవైడర్ల వాదనకు ఏపీ సీఐడీ కౌంటర్


ఓటుకు నోటు కేసు నేపథ్యంలో తెరపైకి వచ్చిన ఫోన్ ట్యాపింగ్ పై దర్యాప్తు చేస్తున్న ఏపీ సీఐడీ అధికారులు నేడు విజయవాడ కోర్టులో కౌంటర్ పిటీషన్ దాఖలు చేయనున్నారు. ఈ కేసులో కాల్ డేటా ఇచ్చేందుకు నెల రోజుల వ్యవధి కావాలని మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లు కోర్టుకు విన్నవించిన సంగతి తెలిసిందే. అయితే కాల్ డేటా ఇచ్చేందుకు నెల రోజుల సమయమెందుకని ప్రశ్నిస్తున్న ఏపీ సీఐడీ అధికారులు, సర్వీస్ ప్రొవైడర్ల పిటీషన్ పై కౌంటర్ పిటీషన్ దాఖలు చేయనున్నారు. కేసు ప్రాధాన్యం దృష్ట్యా తక్షణమే తమకు కాల్ డేటా వివరాలు కావాల్సిందేనని సీఐడీ అధికారులు కోర్టును కోరనున్నారు. దీనిపై కోర్టు ఎలా స్పందిస్తుందన్న విషయంపై అటు సీఐడీ అధికారుల్లోనే కాక, ఇటు సర్వీస్ ప్రొవైడర్లలోనూ ఉత్కంఠ నెలకొంది.

  • Loading...

More Telugu News