: 11.30 గంటలకు డీఎస్ ప్రెస్ మీట్... డిగ్గీరాజాపై మరోమారు విమర్శలు తప్పవా?


కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తూ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సుదీర్ఘ లేఖ రాసిన ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ నేటి ఉదయం 11.30 గంటలకు మీడియా ముందుకు రానున్నారు. ఇప్పటికే తన రాజీనామాకు పరోక్షంగా ఏఐసీసీ జనరల్ సెక్రటరీ దిగ్విజయ్ సింగే కారణమని ఆరోపించిన డీఎస్, మరోమారు డిగ్గీరాజాపై విమర్శలు గుప్పించడం ఖాయంగానే కనిపిస్తోంది. అంతేకాక టీఆఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ పై డీఎస్ ప్రశంసల జల్లు కురిపించే అవకాశాలూ ఉన్నాయి. నిన్నటిదాకా కేసీఆర్ ను తెగడిన నోటితోనే నేడు డీఎస్ ఆయనను పొగడనున్నారు. సోనియాకు రాసిన లేఖలోనే కేసీఆర్ ను డీఎస్ ఆకాశానికెత్తేశారు. ఇక నేటి ఉదయం 11.30 గంటలకు జరగనున్న మీడియా సమావేశంలో డీఎస్ ఏఏ అంశాలను ప్రస్తావిస్తారన్న అంశంపై ఇరు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

  • Loading...

More Telugu News