: ఒక్క టోర్నీ ఆ రెండు దేశాలకు కాసుల వర్షం కురిపించింది
వన్డే ప్రపంచకప్ నిర్వహణ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలకు కాసుల వర్షం కురిపించిందని ఐసీసీ ప్రకటించింది. ప్రపంచ కప్ సందర్భంగా ఆ రెండు దేశాలకు పర్యాటకులు పోటెత్తారని ఐసీసీ తెలిపింది. ఈ మెగా టోర్నీ కారణంగా ఆ రెండు దేశాల ఆర్థికాభివృద్ధిలో చెప్పుకోదగ్గ మార్పు కనిపించిందని ఐసీసీ పేర్కొంది. వరల్డ్ కప్ సందర్భంగా 1.1 బిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల ఆర్థిక లావాదేవీలు జరిగాయని ఐసీసీ తెలిపింది. 8,320 మందికి నేరుగా ఉద్యోగాలు కల్పించామని ఐసీసీ చెప్పింది. ఈ టోర్నీని ప్రత్యక్షంగా వీక్షించేందుకు 1.45 లక్షల మంది పర్యాటకులు ఈ రెండు దేశాలకు వచ్చారని ఐసీసీ వెల్లడించింది. వీరి కారణంగా గణనీయమైన ఆదాయం ఈ రెండు దేశాలకు వచ్చిందని పేర్కొంది. టోర్నీ కారణంగా ఆస్ట్రేలియా జీడీపీ గణనీయమైన వేగంతో దూసుకుపోయిందని ఐసీసీ తెలిపింది. టోర్నీకి వచ్చిన పర్యాటకులు 855 మిలియన్ అమెరికన్ డాలర్లు (సుమారు 5 వేల కోట్ల రూపాయలు) ఇక్కడ ఖర్చు చేశారని ఐసీసీ తెలిపింది.