: నా పని నాదే...అలాంటివి పట్టించుకోను: సన్నీ లియోన్
తన పనేదో తాను చేసుకుపోతానని, నిరాధార ఆరోపణలకు స్పందించనని బాలీవుడ్ శృంగార తార సన్నీ లియోన్ తెలిపింది. సన్నీలియోన్ దేశం విడిచి వెళ్లాలంటూ మరో శృంగార తార రాఖీ సావంత్ ఆరోపించడంపై సన్నీ మాట్లాడుతూ, అలాంటి వ్యాఖ్యలను తాను పట్టించుకోనని అంది. అది ఆమె సమస్య అని పేర్కొంది. తన గురించి ఇతర నటీనటులెవరూ అలా స్పందించగా తాను వినిలేదని సన్నీ లియోన్ పేర్కొంది. తాను పని చేసుకునేందుకే ఇక్కడికి వచ్చానని, తన పనేదో తాను చేసుకుపోతానని చెప్పింది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోనని సన్నీలియోన్ స్పష్టం చేసింది.