: రేవంత్ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు


తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ఓటుకు నోటు కేసులో అరెస్టైన రేవంత్ రెడ్డి నేడు బెయిల్ పై విడుదలయ్యారు. దీంతో ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. జైలు నుంచి ఆయనను ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఈ ఊరేగింపుకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. చర్లపల్లి నుంచి వస్తూ మార్గమధ్యంలో ట్యాంక్ బండ్ మీదున్న అంబేద్కర్ విగ్రహానికి పూలదండ వేసి, అక్కడి నుంచి ఎన్టీఆర్ భవన్ కు వెళ్లనున్నారు. కాగా, జైలు నుంచి విడుదలైన రేవంత్ రెడ్డిని కలిసేందుకు స్థానిక నేతలు, కార్యకర్తలు తరలి వస్తున్నారు. బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నారు.

  • Loading...

More Telugu News