: లంబుగానికి దిమాఖ్ కాళ్లలో ఉన్నట్టుంది: రేవంత్
లంబుగానికి దిమాఖ్ కాళ్లలో ఉన్నట్టుందని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావుని టీడీపీ నేత రేవంత్ రెడ్డి పరోక్షంగా ఎద్దేవా చేశారు. చర్లపల్లి జైలు నుంచి విడుదలైన అనంతరం ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, రాజకీయాల్లోకి రాకముందు మేనమామ ఇంట్లో రబ్బరు చెప్పులు వేసుకుని, చాయ్ కప్పులు ఎత్తేవానికి, మేనమామ గతచరిత్ర తెలియదని అన్నారు. ఇంటికెళ్లి మామ పదవులు రాకముందు ఏం చేసేవాడో తన తల్లిని అడగాలని ఆయన సూచించారు. అప్పుడామె... మీ మేనమామ గల్ఫ్ ఏజెంట్ అని, విదేశాలకు జనాలను తరలించేవాడని చెబుతారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై పాస్ పోర్టు కుంభకోణం కేసులు ఉన్నాయని అన్నారు. అప్పట్లో పోలీసులెక్కడ పట్టుకెళ్లిపోతారోనని ఢిల్లీలో కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెస్సార్ ఇంట్లో దాక్కున్నాడని ఆయన పేర్కొన్నారు.