: మరింత తగ్గిన బంగారం, వెండి ధరలు
వరుసగా రెండోరోజు కూడా బంగారం, వెండి ధరలు మరింత తగ్గాయి. ఈ రోజు రూ.140 తగ్గిన పసిడి ధర 10 గ్రాములు రూ.26,716కు చేరింది. 99.9 శాతం స్వచ్ఛమైన బంగారం ధర రూ.26,710గా నమోదైంది. అటు వెండి ధర కూడా రూ.10 తగ్గి కేజీ వెండి ధర రూ.36,050కి చేరింది. డిమాండ్ తగ్గడంతో నగల వ్యాపారులు కొనుగోళ్లు చేపట్టకపోవడం, బలహీనంగా ఉన్న ప్రపంచ మార్కెట్ల ప్రభావం, డాలరు బలపడుతుండటంతో ఈ రెండు లోహాల ధరలు తగ్గుతున్నాయని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి.