: ప్రమాదం తరువాత తొలిసారి సెక్రటేరియట్ కు వచ్చిన ఈటెల
తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఈరోజు సచివాలయానికి వచ్చారు. గత నెల కరీంనగర్ జిల్లాలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఆయన గాయపడిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఈటెల కాలుకు సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో శస్త్రచికిత్స జరిగింది. అప్పటి నుంచి విశ్రాంతి తీసుకున్న మంత్రి ప్రస్తుతం పూర్తిగా కోలుకోవడంతో నేడు సచివాలయానికి వచ్చారు. తరువాత ఆర్థిక శాఖ అధికారులతో సమావేశమై పలు విషయాలపై చర్చించారు.