: టీమిండియా కెప్టెన్ పదవి చాలా సులువుగా లభిస్తోంది: అగార్కర్
మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్ భారత క్రికెట్ పరిణామాలపై స్పందించాడు. ఓ క్రికెట్ వెబ్ సైట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టీమిండియా కెప్టెన్సీపై తన అభిప్రాయాలు తెలిపాడు. ఈ రోజుల్లో భారత ఆటగాళ్లకు కెప్టెన్సీ చాలా సులువుగా లభిస్తోందని వ్యాఖ్యానించాడు. "కెప్టెన్ పదవికి ఎంపికయ్యాడూ అంటే ఆ వ్యక్తి ఎంతో గౌరవం, ప్రతిష్ఠ పొందినట్టే. కానీ, ఓ వ్యక్తికి సులభంగా కెప్టెన్సీ దక్కితే దాని ప్రాముఖ్యత కోల్పోయినట్టే" అని అన్నారు. ముంబై క్రికెటర్ అజింక్య రహానేకు టీమిండియా కెప్టెన్సీ దక్కడం పట్ల స్పందిస్తూ... "అతడు మృదుస్వభావి. కెప్టెన్ గా అపార అనుభవం లేకపోవచ్చుగానీ, తానెంతటి వ్యూహ చతురుడో నిరూపించుకోవడానికి మంచి అవకాశం లభించింది. కెప్టెన్సీ బాధ్యతలను అతనెలా నిర్వర్తిస్తాడో చూడాలి" అని తెలిపాడు. ఇక, జింబాబ్వే జట్టును తేలిగ్గా తీసుకోరాదని సూచించాడు.