: చర్లపల్లి జైలు నుంచి రేవంత్ విడుదల
టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యారు. సాయంత్రం 5.25 గంటలకు చేతులు ఊపుతూ ఆయన బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ఆయనను చూసిన వెంటనే ఆయన అభిమానుల్లో ఆనందం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. వెంటనే తమ అభిమాన నేత వద్దకు పరుగు పెట్టారు. రేవంత్ కు ఘనస్వాగతం పలుకుతూ, భుజాలపైకి ఎత్తుకున్నారు. పూల వర్షం కురిపించారు. పులి బయటకు వచ్చింది అంటూ గట్టిగా అరిచారు. ఈ సందర్భంగా, చర్లపల్లి జైలు పరిసరాలు టీడీపీ జెండాలతో పసుపుమయం అయ్యాయి. రేవంత్ తో పాటు సెబాస్టియన్, ఉదయ్ సింహలు కూడా జైలు నుంచి విడుదలయ్యారు.