: మరణవేదన ఎలా ఉంటుందో ఐఎస్ కు రుచి చూపించిన సిరియా టెర్రర్ గ్రూపు


ఇప్పటివరకు ఎంతోమంది పీకలు నిర్దాక్షిణ్యంగా తెగ్గోసిన ఐఎస్ఐఎస్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పదునైన కత్తితో గొంతు కోయడం, పాయింట్ బ్లాంక్ రేంజ్ లో తుపాకీతో కాల్చి చంపడం ఐఎస్ నైజం. ఇప్పుడా నొప్పి ఎలా ఉంటుందో ఐఎస్ కు రుచి చూపించింది సిరియాకు చెందిన జైష్ అల్-ఇస్లామ్ అనే టెర్రర్ గ్రూపు. పెద్ద సంఖ్యలో ఐఎస్ఐఎస్ మిలిటెంట్లను బందీలుగా పట్టుకున్న సిరియా గ్రూపు వారిని హతమార్చి, ఆ దృశ్యాలతో కూడిన వీడియోను విడుదల చేసింది. ఇంతకుముందు ఐఎస్ విడుదల చేసిన వీడియోల్లో బందీలు ఆరెంజ్ కలర్ దుస్తుల్లో, మిలిటెంట్లు నలుపు రంగు దుస్తుల్లో కనిపించడం తెలిసిందే. ఇప్పుడు జైష్ అల్-ఇస్లామ్ టెర్రరిస్టులు ఆరెంజ్ కలర్ దుస్తులు ధరించగా, బందీలైన ఐఎస్ మిలిటెంట్లు నలుపు దుస్తుల్లో కనిపించారు. దీనిపై జైష్ కమాండర్ మాట్లాడుతూ... తమ జిహాద్ కు ఐఎస్ఐఎస్ పెను విపత్తులా తయారైందని పేర్కొన్నారు. సిరియాలో వేళ్లూనుకుపోయిన జైష్ అల్-ఇస్లామ్ గ్రూపులో 25,000 మంది వరకు సాయుధులున్నారు. ఈ గ్రూపు అటు సిరియా పాలకవర్గంతోనూ, ఇటు ఐఎస్ఐఎస్ తోనూ పోరాటం సాగిస్తోంది. ఇస్లాం సైన్యంగా తనను తాను పిలుచుకునే ఈ గ్రూపులో సిరియాలోని అనేక తిరుగుబాటు వర్గాలు విలీనమయ్యాయి. దీంతో, గ్రూపు శక్తిసామర్థ్యాలు విశేషంగా పెరిగాయి.

  • Loading...

More Telugu News