: కేంద్రం మెడకు కొత్త వివాదం


కేంద్రం మెడకు కొత్త వివాదం చుట్టుకుంది. స్వతంత్ర భారతావని మొట్టమొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ సమాచారంతో కూడిన వికీపీడియాలోని మొదటి పేజ్ ను ఎవరో ఎడిట్ చేశారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ప్రభుత్వానికి చెందిన ఐపీ అడ్రెస్ తో ఎవరో ఈ పేజ్ ను ఎడిట్ చేశారని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. దీనిపై ఢిల్లీలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణధీవ్ సూర్జీవాలా మీడియాతో మాట్లాడుతూ, మాజీ ప్రధాని నెహ్రూ ముస్లిం అని, అలాగే నెహ్రూ బ్రిటిషర్ అని వికీపీడియా పేజీలోని మొదటి పేరాలో కొత్తగా పేర్కొన్నారని ఆరోపించారు. ఆ తరువాత దీనిని వికీపీడియా ఎడిటర్లు తొలగించారని ఆయన తెలిపారు. ''నెహ్రూ హిందువా, ముస్లిమా? అన్నది ప్రధానం కాదు. ఆయన భారతీయుడు" అన్నారాయన. ఈ విషయంపై పూర్తి స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేసిన ఆయన, చరిత్రకు మసిపూస్తున్నారని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News