: బెయిల్ ఔట్ కండిషన్లకు గ్రీస్ ఒప్పుకుంటుందన్న వార్తలతో రంకె వేసిన బుల్


దివాళా తీసిన గ్రీస్ దేశానికి బెయిల్ ఔట్ ప్యాకేజ్ ఇవ్వడానికి క్రెడిటర్లు పెట్టిన కండిషన్లకు ఆ దేశం ఒప్పుకుంటుందని ఫైనాన్షియల్ టైమ్స్ వెల్లడించడంతో ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ బలపడింది. దీంతో, వారు కొనుగోళ్లకు మొగ్గు చూపారు. ఈ క్రమంలో, ఈ రోజు స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 240 పాయింట్లు పెరిగి 28,021కి చేరగా... నిఫ్టీ 85 పాయింట్లు ఎగబాకి 8,453కు చేరుకుంది. ఇవాల్టి టాప్ గెయినర్లలో అలోక్ ఇండస్ట్రీస్, ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్, రాజేష్ ఎక్స్ పోర్ట్స్, ఎస్ఆర్ఈఐ ఇన్ ఫ్రా స్ట్రక్చర్, సియట్ లు ఉన్నాయి. నెస్లే ఇండియా, వెల్స్ పన్ కార్ప్, పీఎంసీ ఫిన్ కార్ప్, మెక్ లియోడ్ రస్సెల్, ముత్తూట్ ఫైనాన్స్ లు టాప్ లూజర్స్ జాబితాలో ఉన్నాయి.

  • Loading...

More Telugu News