: హిందూ మహాసముద్రమేమీ భారత్ ఇంటివెనుక పెరడు కాదు: చైనా
ఆసియాలో అన్ని రంగాల్లో ఆధిపత్యం కోసం దూకుడు ప్రదర్శిస్తున్న చైనా ఇప్పుడు హిందూ మహాసముద్రంపై పట్టుకోసం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. భారత్ ను ఆత్మరక్షణ ధోరణిలోకి నెట్టేసేందుకు యత్నిస్తోంది. హిందూ మహాసముద్రమేమీ భారత్ ఇంటివెనుక పెరడు కాదని తాజాగా వ్యాఖ్యానించింది. ప్రస్తుతం చైనాలో పర్యటిస్తున్న భారత పాత్రికేయుల బృందంతో సీనియర్ కెప్టెన్ ఝావో యి మాట్లాడుతూ... హిందూ మహాసముద్ర ప్రాంతంలో స్థిరత్వం కోసం భారత్ ప్రత్యేక పాత్ర పోషించాల్సి ఉందని అన్నారు. అయితే, మరే ఇతర దేశాల నావికాదళాలు హిందూ మహాసముద్రంలో అడుగుపెట్టరాదని చెప్పడానికి ఆ ప్రాంతమేమీ భారత్ ఇంటివెనుక పెరడు కాదని వ్యాఖ్యానించారు. సొంత స్థలం మాదిరిగా హిందూ మహాసముద్రాన్ని పరిగణించరాదని సూచించారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో పట్టు కోసం చైనా... ద్వీపదేశం శ్రీలంకతో మైత్రికి ప్రాముఖ్యతనిస్తోన్న విషయం తెలిసిందే.