: టి.ఏసీబీకి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర మరోసారి లేఖ
టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మరోసారి తెలంగాణ అవినీతి నిరోధక శాఖకు లేఖ రాశారు. ఏసీబీ ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చి విచారణకు సహకరిస్తానని లేఖలో పేర్కొన్నారు. వెన్ను, కాలునొప్పి కారణంగా రాజమండ్రిలోని బొల్లినేని ఆసుపత్రిలో 10 రోజుల పాటు చికిత్స పొందానని సండ్ర వివరించారు. ఓటుకు నోటు కేసులో సండ్రను విచారించేందుకు గత నెలలో నోటీసు జారీ చేసినప్పటికీ అనారోగ్యం కారణంగా రాలేకపోతున్నానని ఆయన ఏసీబీకి లేఖ రాసిన సంగతి విదితమే. మరోపక్క, మొన్నటితో ఏసీబీ ఇచ్చిన గడువు కూడా ముగియడంతో మరోసారి సండ్రకు టి.ఏసీబీ నోటీసులు ఇవ్వనుందన్న ప్రచారం జరిగింది.