: ప్రణబ్ తిరుమల పర్యటనలో అపశ్రుతి... సీఎంఓ వాహనానికి ప్రమాదం
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తిరుమల పర్యటనలో స్వల్ప ప్రమాదం జరిగింది. ఆయన కాన్వాయ్ లోని ఓ వాహనం అలిపిరి టోల్ గేటు వద్ద డివైడరును ఢీకొట్టింది. ఈ కారులో ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు ప్రయాణిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో కాన్వాయ్ నిదానంగా వెడుతుండడంతో పెద్ద ప్రమాదం తప్పింది. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది క్రేన్ ను తెప్పించి కారును పక్కకు తీయించడంతో కాన్వాయ్ తిరుమల ప్రయాణం కొనసాగింది. కారు ప్రమాదంపై ఎవరికైనా గాయాలయ్యాయా? అని ప్రణబ్ అధికారులను అడిగినట్టు తెలిసింది. కొద్దిసేపటి క్రితం ప్రణబ్ ముఖర్జీ తిరుమల చేరుకున్నారు.