: ఎన్నికల ముందు అవినీతిపై మాట్లాడిన దానికి... ఇప్పుడు చేస్తున్న దానికి పొంతన లేదు: బీజేపీపై విరుచుకుపడ్డ ఆర్ఎస్ఎస్ నేత


బీజేపీ నాయకత్వంపై ఆర్ఎస్ఎస్ నేత కె.ఎన్.గోవిందాచార్య విరుచుకుపడ్డారు. నానాటికీ మోదీ ప్రభుత్వం నిజాయతీ లోపించిన ప్రభుత్వంగా మారుతోందని విమర్శించారు. ఎన్నికలకు ముందు అవినీతిపై బీజేపీ నేతలు మాట్లాడిన దానికి, ఇప్పుడు చేస్తున్న దానికి పొంతన లేకుండా ఉందని అన్నారు. విలువలు లేకుండా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. లలిత్ మోదీ కుంభకోణంలో కేంద్ర మంత్రి సుష్మ స్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజేలపై ఆరోపణలు వస్తున్నప్పటికీ బీజేపీ నాయకత్వం వారిని వెనకేసుకొస్తున్న తీరును గోవిందాచార్య తప్పుబట్టారు. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ మేరకు స్పందించారు. మరోవైపు, మోదీ చాలా తెలివైన నేత అని, ఆయనకు ఎంతో పరిజ్ఞానం ఉందని చెప్పిన గోవిందాచార్య... పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యే నాటికి బీజేపీ నాయకత్వం సరైన నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News