: రెడ్ మీ నోట్ 4జి ధరను రూ. 2 వేలు తగ్గించిన జియోమీ


కొత్తగా స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలని భావించేవారికి మంచి వార్త ఇది. ఇండియాలో విడుదలైన సెకన్ల వ్యవధిలో రూ. 9,999 ధరపై 20 వేల ఫోన్లు అమ్ముడైన 4జి ఫోన్ 'రెడ్ మీ నోట్' ధర ఇప్పుడు రూ. 7,999కి తగ్గింది. ఈ స్మార్ట్ ఫోన్ ధరను రూ. 2 వేలు తగ్గిస్తున్నట్టు జియోమీ నేడు వెల్లడించింది. ఈ ఫోన్లను ఎయిర్ టెల్ రిటైల్ స్టోర్లతో పాటు మీ డాట్ కాం, ఫ్లిప్ కార్ట్, అమేజాన్, స్నాప్ డీల్, ది మొబైల్ స్టోర్ తదితరాల్లో అందుబాటులో ఉంచినట్టు సంస్థ పేర్కొంది. ఈ ఫోన్ గత సంవత్సరం డిసెంబర్ లో మార్కెట్లోకి వచ్చిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News