: పశ్చిమబెంగాల్ లో కొండచరియలు విరిగిపడి 18 మంది మృతి
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో కొన్ని రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. వర్షాల కారణంగా డార్జిలింగ్ జిల్లాలోని డార్జిలింగ్, కాలింపాంగ్, కుర్సియాంగ్ సబ్ డివిజన్లలో కొండచరియలు విరిగిపడి 18 మంది చనిపోయారని అధికారులు తెలిపారు. మరో 15 మంది గల్లంతైనట్టు చెప్పారు. కొండచరియలు విరిగిపడటంతో విస్తృతమైన నష్టం జరిగిందని, డార్జిలింగ్ నుంచి సిక్కిం రాష్ట్రానికి టెలికమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నదని అధికారులు వివరించారు. అంతేగాక జాతీయ రహదారులు పూర్తి స్థాయిలో ధ్వంసమయ్యాయని వెల్లడించారు. ప్రస్తుతం సహాయకచర్యలు కొనసాగుతున్నాయిని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అన్నారు.