: చివరి దశలో ఉన్న చిన్నారుల కోరిక తీర్చడం గొప్ప విషయం: అల్లు అర్జున్
తీవ్ర అనారోగ్యం పాలైన చిన్నారులను టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ కలుసుకున్నారు. రెడ్ హిల్స్ మేక్ ఏ విష్ ఫౌండేషన్ కార్యాలయానికి వెళ్లిన ఆయన విషమ పరిస్థితిని ఎదుర్కొంటున్న చిన్నారులను కలుసుకుని వారిని సంతోషంలో ముంచెత్తారు. వారి తల్లిదండ్రులను ఓదార్చారు. ఆ చిన్నారులకు సైకిళ్లు బహుకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చివరి దశలో ఉన్న చిన్నారుల కోరిక తీర్చడం గొప్ప విషయమని అన్నారు. ఈ దశలో పిల్లలకు సాయం కంటే మనోధైర్యం ఇవ్వడమే ముఖ్యమని అల్లు అర్జున్ అభిప్రాయపడ్డారు. 'మేక్ ఏ విష్' సంస్థ కృషి అభినందనీయం అని ప్రశంసించిన ఈ యువ హీరో ఆ సంస్థకు అందరూ చేయూతనివ్వాలని కోరారు.