: కేసీఆర్ తో భేటీపై డీఎస్ వివరణ
'ఎమ్మెల్సీ' విషయంలో తనకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ అధిష్ఠానంపై సీనియర్ నేత డి.శ్రీనివాస్ గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన బుధవారం తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎం క్యాంప్ కార్యాలయంలో కేసీఆర్ ను కలిసిన అనంతరం డీఎస్ మాట్లాడారు. కేసీఆర్ జ్వరంతో బాధపడుతున్నందున ఆయనను పరామర్శించడానికి వచ్చానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు గుర్తింపులేదని, సోనియా గాంధీని కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. డీఎస్ కాంగ్రెస్ ను వీడి గులాబీ కండువా ధరిస్తారని మీడియాలో కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే.