: అత్యాచార కేసుల్లో బాధితులు, నిందితులు రాజీ చేసుకున్నా నేరమే: సుప్రీంకోర్టు కీలక తీర్పు
మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. అత్యాచారం చేయడమే కాదు, అత్యాచార కేసుల్లో రాజీ యత్నాలు చేయడం కూడా తప్పే అంటూ స్పష్టం చేసింది. మహిళలు తమ శరీరాలను దేవాలయాల్లాగా భావిస్తారని... ఈ నేపథ్యంలో, రాజీ చేయాలనుకుంటే మహిళల హక్కులను హరించినట్టేనని తెలిపింది. ఈ కేసుల్లో నిందితులు, బాధితులు రాజీపడినా నేరమే అని చెప్పింది.