: యోగాను క్షుద్ర విద్యగా భావించి ఆంక్షలు విధించారు!


ప్రపంచానికి భారత్ పరిచయం చేసిన అద్భుత వ్యాయామ విద్య యోగా అని ఎన్నో దేశాలు చెబుతుంటాయి. భారత్ లో పుట్టిన ఈ పురాతన విద్య ఇప్పుడు ప్రపంచవ్యాప్తం అయింది. రష్యాలోనూ బాగా ప్రజాదరణ పొందింది. అయితే, రష్యాలోని నిజ్నెవార్తోవ్ స్క్ నగరంలో మాత్రం యోగాపై ఆంక్షలు విధించారు. యోగా కారణంగా 'మత సంబంధ క్షుద్రోపాసన' వ్యాప్తి చెందుతుందని భయపడిన ఆ నగర అధికార వర్గాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఈ క్రమంలో, నగరంలో హఠ యోగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించే ఆరో, ఇంగారా ఫిట్ నెస్ స్టూడియోలపై ఆంక్షలు విధించారు. ప్రభుత్వ భవనాలు, ప్రభుత్వ స్థలాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. దాంతో, ఆ స్టూడియోలు స్టేడియంలలోనూ, మీటింగ్ హాళ్లలోనూ యోగా క్లాసులు నిర్వహిస్తున్నాయట. నగర పాలకవర్గం తాజా ఆదేశాలపై 'ద మాస్కో టైమ్స్' స్పందిస్తూ... మత సంబంధ క్రతువులు, ఉద్యమాలు నిరోధించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారంటూ తన కథనంలో పేర్కొంది.

  • Loading...

More Telugu News