: అమలాపురం టీడీపీ ఎంపీకి సంజాయిషీ నోటీసు ఇవ్వండి: చంద్రబాబు ఆదేశం
తమ పార్టీకి చెందిన అమలాపురం ఎంపీ రవీంద్రబాబుకు సంజాయిషీ నోటీసు ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీని ఆదేశించారు. సైనికులపై రవీంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మాజీ సైనికులు ఆందోళనకు దిగడంతో, ఆయన ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు, బాధ్యత లేకుండా వ్యాఖ్యలు చేసినందుకు రవీంద్రబాబుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల పార్టీ ఇమేజ్ దెబ్బతింటుందని చెప్పిన చంద్రబాబు... సైనికులంటే టీడీపీకి ఎంతో గౌరవం అని తెలిపారు. మద్యం, మాంసం, ఉచిత ప్రయాణం కోసమే యువత సైన్యంలో చేరుతున్నారని రవీంద్రబాబు ఓ డిబేట్ లో అన్నారు. ఈ వ్యాఖ్యలు సంచలనం రేపాయి.