: కాంగ్రెస్ కు డీఎస్ గుడ్ బై?... కాసేపట్లో అధికారికంగా ప్రకటించే అవకాశం
కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేత డి.శ్రీనివాస్ గుడ్ బై చెప్పనున్నారు. దానికి సంబంధించి మీడియాకు ఆయన అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. కొద్దిసేపటికిందట సీఎం కేసీఆర్ ను క్యాంప్ కార్యాలయంలో కలసిన డీఎస్, కాంగ్రెస్ కు రాజీనామా చేశారని సమాచారం. మరోదఫా ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని పార్టీ అధిష్ఠానాన్ని కోరినా అంగీకరించకపోవడంతో పార్టీ వైఖరి ఆయనను బాధించి కొన్ని రోజుల నుంచి కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. మరోవైపు డీఎస్ పార్టీ మారుతున్న విషయం తెలిసి ఆ పార్టీ తెలంగాణ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, డీకే అరుణ, భట్టి విక్రమార్క, వీహెచ్ కొద్దిసేపటికిందట ఆయన ఇంటికి వెళ్లారు. అయితే, ఆయన ఇంట్లో లేకపోవడంతో తిరిగి వెళ్లిపోయారు.