: బెయిలు కోసం మరోసారి హైకోర్టు గడపతొక్కిన రేవంత్ లాయర్లు


నిన్న తమ క్లయింటు రేవంత్ రెడ్డికి ఇచ్చిన బెయిలార్డరులో ఉన్న తప్పులను సవరించి తిరిగి ఆర్డర్ ఇవ్వాలని కోరుతూ, ఆయన తరపు న్యాయవాదులు ఈ ఉదయం హైకోర్టులో మెమో దాఖలు చేశారు. న్యాయమూర్తి దీన్ని పరిశీలించి మరో ఆర్డర్ ఇవ్వాలని ఆదేశిస్తే, ఈ మధ్యాహ్నానికి తప్పులు సవరించిన ఆర్డర్ న్యాయవాదుల చేతికి అందుతుందని సమాచారం. దీన్ని తీసుకుని ఏసీబీ కోర్టుకు, ఆపై అక్కడి నుంచి చర్లపల్లి జైలుకు సాయంత్రం 4:30 గంటల్లోపు న్యాయవాదులు వెళితే, రేవంత్ నేడు బయటకు వస్తారు. లేకుంటే ఆయన మరోరోజు జైల్లో గడపాల్సి రావచ్చు. కాగా, హైకోర్టు ఉత్తర్వుల కాపీలో, ఏసీబీ ప్రత్యేక కోర్టుకు ఆదేశాలు ఇవ్వాల్సి ఉండగా, ఏసీబీ అధికారులకు ఆదేశాలు ఇస్తున్నట్లు ఉన్న కారణంగానే నిన్న ఆయన విడుదల కాలేకపోయారని రేవంత్‌ తరఫు న్యాయవాది సుధీర్‌ కుమార్‌ వివరించారు. టైపింగ్ పొరపాటు వల్లనే ఇది జరిగిందని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News